ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీలో స్కామ్ జరిగింది: ఏసీబీ
- రూ. 117 కోట్లు పక్కదారి పట్టినట్టు ఏసీబీ గుర్తింపు
- పలువురిపై ఇప్పటికే కేసుల నమోదు
- సచివాలయ ఉద్యోగుల పాత్ర ఉన్నట్టు కూడా ఏసీబీ గుర్తింపు
ఈ స్కామ్ లో ప్రజాప్రతినిధుల పీఏలు, వారి అనుచరుల ప్రమేయం ఉన్నట్టు ఏసీబీ గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ కుంభకోణంలో దాదాపు 50 మంది ప్రమేయం ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఇప్పటికే పలువురిని అరెస్ట్ కూడా చేశారు. అంతేకాదు ఏపీ సచివాలయంలో కొందరు ఉద్యోగుల పాత్ర ఉన్నట్టు కూడా ఏసీబీ గుర్తించింది.