మావోయిస్టులకు ఎదురుపడిన పోలీసులు.. కాల్పులు జరుపుతూ తప్పించుకున్న నక్సల్స్
- ఏవోబీలోని తులసిపాడు అటవీ ప్రాంతంలో ఘటన
- వారోత్సవాలకు మావోయిస్టులు సిద్ధమవుతున్నట్టు పోలీసులకు సమాచారం
- కూంబింగ్ కోసం వెళ్లిన పోలీసులను చూసి కాల్పులు
మావోయిస్టులు వారోత్సవాలకు సిద్ధమవుతున్నట్టు తమకు సమాచారం అందిందని, దీంతో డీవీఎఫ్, ఎస్‌వోజీ బలగాలు తులసిపాడు అటవీ ప్రాంతానికి చేరుకున్నాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో తారపడిన మావోయిస్టులు పోలీసులపైకి కాల్పులు జరుపుతూ అక్కడి నుంచి తప్పించుకున్నట్టు తెలిపారు. పరారైన మావోల కోసం గాలిస్తున్నట్టు చెప్పారు.