KIA: అనంతపురం జిల్లాలో కర్రలు, రాడ్లతో కొట్టుకున్న కియా అనుబంధ సంస్థల ఉద్యోగులు

Brawl between KIA related companies employees in Anantapur district
  • కియా మోటార్స్ పరిశ్రమలో ఘర్షణలు!
  • రెండు అనుబంధ సంస్థల ఉద్యోగుల మధ్య ఘర్షణ
  • విచక్షణ రహితంగా కొట్టుకున్న ఉద్యోగులు
  • సోషల్ మీడియాలో వీడియో
అనంతపురం జిల్లా పెనుకొండలోని కియా మోటార్స్ పరిశ్రమలో తీవ్ర ఉద్రికత్తలు ఏర్పడ్డాయి. కియా అనుబంధ సంస్థలకు చెందిన ఉద్యోగులు కొందరు కర్రలు, రాడ్లతో దాడి చేసుకోవడం కలకలం రేపింది. గత కొంతకాలంగా సీనియర్ ఉద్యోగులు, జూనియర్ ఉద్యోగుల మధ్య వివాదాలు ఉన్నాయి. అది కూడా రెండు అనుబంధ సంస్థల ఉద్యోగుల మధ్యే విభేదాలు నెలకొన్నట్టు తెలుస్తోంది.

ఇటీవల ఉద్యోగుల మధ్య గొడవలు పతాకస్థాయికి చేరాయి. తాజా ఘర్షణలను కొందరు వీడియో చిత్రీకరించారు. విచక్షణరహితంగా ఒకరిపై మరొకరు దాడులకు తెగబడ్డారు. ఈ దాడులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనలతో కియా సంస్థలోని ఇతర ఉద్యోగులు హడలిపోతున్నారు. అటు యాజమాన్యం కానీ, ఇటు పోలీసులు కానీ ఈ గొడవలను పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
KIA
Attacks
Employess
Anantapur District

More Telugu News