Indian Airforce: ఎయిర్‌ఫోర్స్ కొత్త చీఫ్‌గా వీఆర్ చౌధరి నియామకం

  • ప్రస్తుతం వాయుసేన వైస్ చీఫ్ గా ఉన్న చౌధరి
  • కీలక ప్రకటన చేసిన భారత రక్షణ శాఖ
  • ఈ నెల 30తో ముగియనున్న ప్రస్తుత చీఫ్ పదవీకాలం
VR Chowdhary named as Airforce next chief

మరికొన్ని రోజుల్లో భారత వాయుసేన చీఫ్ పదవీకాలం ముగియనుంది. ఈ క్రమంలో భారత రక్షణ శాఖ కీలక ప్రకటన చేసింది. భారత వాయుసేన నూతన చీఫ్‌గా వీఆర్ చౌధరిని నియమిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం వాయుసేన దళాధిపతిగా ఉన్న ఆర్‌కేఎస్ భదౌరియా పదవీకాలం ఈ నెల 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో నూతన చీఫ్‌గా ఎవరిని నియమిస్తారనే అంశానికి రక్షణ శాఖ తెరదించింది.

ప్రస్తుతం ఎయిర్‌ఫోర్స్ వైస్ చీఫ్ గా ఉన్న ఎయిర్ మార్షల్ వీఆర్ చౌధరిని నూతన చీఫ్ గా  నియమించనున్నట్లు ప్రకటించింది. ఆయన 1982 డిసెంబర్ 29న వాయుసేనలో చేరారు. పలు రకాల ఫైట్ జెట్ విమానాలతోపాటు ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లలో 3800 గంటలకుపైగా ప్రయాణించిన అనుభవం చౌధరి సొంతం. ఈ విషయాన్ని వాయుసేన ఒక ప్రకటనలో వెల్లడించింది.

నేషనల్ డిఫెన్స్ అకాడమీతోపాటు వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజిలో చదువుకున్నారు. వెస్టర్న్ ఎయిర్ కమాండ్‌కు కమాండర్‌గా కూడా సేవలందించారు. ఈ ఏడాది జులై 22న వైస్ చీఫ్ గా బాధ్యతలు అందుకున్నారు.

More Telugu News