ఏపీలో మరో 1,179 మందికి కొవిడ్ పాజిటివ్

AP Corona details update
  • ఏపీలో కొనసాగుతున్న కొవిడ్ వ్యాప్తి
  • గత 24 గంటల్లో 49,737 కరోనా పరీక్షలు
  • తూర్పుగోదావరి జిల్లాలో 192 కేసులు
  • విజయనగరం జిల్లాలో ఒక పాజిటివ్ కేసు
  • రాష్ట్రంలో 11 మంది మృతి
ఏపీలో కొవిడ్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 49,737 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,179 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 192 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 190, కృష్ణా జిల్లాలో 167, పశ్చిమ గోదావరి జిల్లాలో 161 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో ఒక పాజిటివ్ కేసు నమోదైంది.

అదే సమయంలో 1,651 మంది కరోనా నుంచి కోలుకోగా, 11 మంది మృత్యువాతపడ్డారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 14,089కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,40,708 పాజిటివ్ కేసులు నమోదు కాగా.... 20,12,714 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 13,905 మంది చికిత్స పొందుతున్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
New Cases
Deaths

More Telugu News