Bonda Uma: ప్రత్యేక విమానాల్లో విదేశాలకు డబ్బులు తరలిస్తున్నారు: బొండా ఉమ

YSRCP leaders transporting money in special flights says Bonda Uma
  • ఏపీని వైసీపీ నేరాంధ్రప్రదేశ్ గా మార్చింది
  • వైసీపీ మద్దతుతోనే సుధాకర్ డ్రగ్స్ వ్యాపారాన్ని మొదలుపెట్టాడు
  • జగన్ నాయకత్వంలో ఆ పార్టీ నేతలు పది తరాలకు సరిపడా సంపాదించారు

ఆంధ్రప్రదేశ్ ను వైసీపీ నాశనం చేసిందని, నేరాంధ్రప్రదేశ్ గా మార్చిందని టీడీపీ నేత బొండా ఉమ విమర్శించారు. దేశంలో ఎక్కడ ఏ స్కామ్ జరిగినా దాని మూలాలు ఏపీలోనే ఉంటున్నాయని చెప్పారు. గుజరాత్ లో పట్టుబడిన 9 వేల కోట్ల విలువైన హెరాయిన్ మూలాలు కూడా ఏపీలోనే ఉన్నాయని అన్నారు. హెరాయిన్ నిందితుడు సుధాకర్ వైసీపీ మద్దతుతోనే మాదకద్రవ్యాల వ్యాపారాన్ని మొదలుపెట్టాడని చెప్పారు.

ఎర్రచందనాన్ని వైసీపీ నేతలు ప్రతి రోజు విదేశాలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. తిరుమల వేంకటేశ్వరస్వామికి భక్తులు సమర్పించిన తల వెంట్రుకలను కూడా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని మండిపడ్డారు. వెంట్రుకలను తరలిస్తూ ఇటీవలే పక్కరాష్ట్రాల్లో దొరికిపోయారని అన్నారు. జగన్ నాయకత్వంలో వైసీపీ నేతలు పది తరాలకు సరిపడా సంపాదించారని చెప్పారు. ప్రత్యేక విమానాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు విదేశాలకు డబ్బు తరలిస్తున్నారని అన్నారు.

  • Loading...

More Telugu News