Train Accident: త్రుటిలో ప్రాణాపాయం నుంచి త‌ప్పించుకున్న మ‌హిళ‌.. వీడియో వైర‌ల్

 Passengers saved a woman from falling under a moving train at Vasai Road Railway Station
  • ముంబైలో ఘ‌ట‌న‌
  • క‌దులుతోన్న రైలు ఎక్క‌బోయిన మ‌హిళ‌
  • జారి రైలు కింద ప‌డ‌బోయిన వైనం
  • ర‌క్షించిన తోటి ప్ర‌యాణికుడు
ఓ మ‌హిళ రైలు కింద‌ప‌డ‌బోయి త్రుటిలో ప్రాణాపాయం నుంచి త‌ప్పించుకుంది. ఇందుకు సంబంధించిన మ‌హిళ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో  వైర‌ల్ అవుతోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే, మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైలోని వాస‌యి రోడ్డు రైల్వే జంక్ష‌న్ వ‌ద్ద రైలు ఎక్కేందుకు ఓ మ‌హిళ వ‌చ్చింది.

అయితే, రైలు ఆగి ఉన్న స‌మ‌యంలో ఆమె అందుకోలేక‌పోయింది. రైలు క‌దులుతుండ‌గా ప‌రుగున అక్క‌డ‌కు వ‌చ్చి రైలు ఎక్క‌డానికి ప్ర‌య‌త్నించింది. ఇంత‌లో జారి రైలు కింద ప‌డ‌బోయింది. వెంట‌నే అక్క‌డ ఉన్న ఓ వ్య‌క్తి ఆమెను ప్లాట్‌ఫాం పైకి లాగాడు.

మరికొంత మంది కూడా అక్క‌డ‌కు వ‌చ్చి ఆమెను ర‌క్షించే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో ఆమె ప్రాణాపాయం నుంచి బ‌య‌ట‌ప‌డింది. ముంబై రైల్వే స్టేష‌న్‌లో త‌రుచూ ఇటువంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి.
Train Accident
Maharashtra

More Telugu News