Volcano: స్పెయిన్‌లో పేలిన అగ్నిపర్వతం.. 100 ఇళ్లను ముంచేసిన లావా

Lava engulfs 100 homes in La Palma after volcano erupts
  • 5 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన అధికారులు
  • కేనరీ దీవుల్లో పేలిన ‘ది కుంబ్రే వీజా’ అగ్నిపర్వతం
  • మూడు నిమిషాల్లో ఇల్లు ఖాళీ చేయాలని సూచించిన అధికారులు
  • ఆదరాబాదరాగా పరుగులు తీసిన స్థానికులు
తన దారిలో కనిపించిన ప్రతి వస్తువునూ భస్మం చేస్తూ ముంచుకొచొచ్చిన లావా సుమారు 100 ఇళ్లను కూడా భస్మీపటలం చేసింది. ఈ ఘటన స్పెయిన్‌లోని కేనరీ దీవుల్లో చోటుచేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఇక్కడి లా పామా దీవిలో ఉండే ‘ది కుంబ్రే వీజా’ అనే అగ్నిపర్వతం బద్దలయ్యింది.

దీంతో ఉప్పొంగిన లావా ఆ దీవిని ముంచెత్తింది. ఈ క్రమంలో స్థానికులను సురక్షిత ప్రాంతాలకు చేర్చడానికి అధికారులు చాలా కష్టపడ్డారు. ప్రస్తుతానికి 5 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. అలాగే 100 ఇళ్లను లావా ముంచేసిందని వెల్లడించారు. లావా సుమారు 6 మీటర్లు అంటే 20 అడుగుల మందంలో ఉందని అధికారులు తెలియజేశారు. అది తాకిన ఇళ్లన్నీ బుగ్గిపాలయ్యాయని వివరించారు.

స్థానికంగా ఉన్న ఒక చిన్న స్కూల్ కూడా ఈ లావాకు బలైపోయినట్లు సమాచారం. ‘రెండు గంటల క్రితం వరకూ స్కూల్‌కు ఏమీ కాదనే అనుకున్నాం. కానీ దాన్ని కూడా లావా ముంచేసింది’ అని ఆ స్కూల్ హెడ్‌మాస్టర్ కన్నీళ్లతో చెప్పారు.

‘మా ఇంటి నుంచి 700 మీటర్ల దూరంలో లావా ఉందని తెలిసింది. మాకు ఏం చేయాలో కూడా తెలియడం లేదు’ అని ఒక స్థానికురాలు వాపోయింది. భర్త, మూడేళ్ల కుమారుడితో కలిసి ఇల్లు వదిలి తప్పించుకొని వచ్చిందామె. పోలీసులు తమకు మూడు నిమిషాల సమయం ఇచ్చారని, అంతా చాలా వేగంగా జరిగిపోయిందని ఆమె బాధపడుతోంది.
Volcano
Spain
Lava

More Telugu News