కేసీఆర్ కూడా రెడీ అయితే.. లై డిటెక్టర్ టెస్టుకు నేను సిద్ధం: కేటీఆర్ కు రేవంత్ ప్రతిసవాల్
- ఓటుకు నోటు కేసులో లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధమా? అని కేటీఆర్ సవాల్
- సహారా, ఈఎస్ఐ కుంభకోణాల కేసుల్లో లై డిటెక్టర్ టెస్టుకు కేసీఆర్ సిద్ధమా? అని రేవంత్ ప్రశ్న
- టైమ్, ప్లేస్ చెప్పాలంటూ కేటీఆర్ కు సవాల్
కేటీఆర్ విసిరిన సవాల్ కు రేవంత్ అదే స్థాయిలో ప్రతిస్పందించారు. లై డిటెక్టర్ పరీక్షకు తాను సిద్ధమని... సహారా ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం కుంభకోణాల్లో సీబీఐ కేసుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధం కావాలని అన్నారు. కేసీఆర్ సిద్ధమైతే టెస్టుకు తాను కూడా సిద్ధమని... టైమ్, ప్లేస్ చెప్పాలంటూ కేటీఆర్ కు సవాల్ విసిరారు.