Pawan Kalyan: మహాకవి శ్రీశ్రీ స్మరణలో పవన్, త్రివిక్రమ్... వీడియో ఇదిగో!

 Pawan and Trivikram unveils Sri Sri Mahaprasthanam special edition on Bheemla Naik sets

  • శ్రీశ్రీ అద్భుత సృష్టి 'మహాప్రస్థానం'
  • ఇటీవల స్పెషల్ ఎడిషన్ ప్రచురణ
  • భీమ్లానాయక్ సెట్స్ పై ఆవిష్కరించిన పవన్, త్రివిక్రమ్
  • శ్రీశ్రీ రచనలపై ఆసక్తికర చర్చ

తెలుగు జాతి గర్వించదగ్గ మహాకవి శ్రీశ్రీ. 'మహాప్రస్థానం' కవితా సంపుటితో సాహితీ విశ్వరూపం ప్రదర్శించిన ఈ అభ్యుదయవాది పీడిత వర్గాల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆయన కలం నుంచి జాలువారిన 'మహాప్రస్థానం' సంపుటికి స్పెషల్ ఎడిషన్ ను ఇటీవల రూపొందించారు. తాజాగా ఈ ప్రత్యేక సంచికను భీమ్లా నాయక్ సెట్స్ పై పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆవిష్కరించారు. మహాకవి శ్రీశ్రీ రచించిన ఆ పుస్తకాన్ని వారిద్దరూ ఎంతో ఆసక్తిగా పరిశీలించారు.

శ్రీశ్రీ ఒక సమున్నత పర్వతం వంటివాడని, ఆయన ముందు తాము చిన్న రాళ్ల వంటి వారమని అభిప్రాయపడ్డారు. శ్రీశ్రీ వేసిన ఒక అడుగు, రాసిన పుస్తకం ఒక శతాబ్దం పాటు మాట్లాడతాయని త్రివిక్రమ్ పేర్కొనగా... పవన్ "వాహ్" అంటూ స్పందించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News