USA: ట్రంప్​ హయాంలో తెచ్చిన వీసా రూల్స్​ ను కొట్టేసిన అమెరికా కోర్టు

US Federal Court Turns Down Trump Era H1B Visa Rules
  • అవి చెల్లబోవన్న ఫెడరల్ కోర్టు
  • హోం ల్యాండ్ సెక్యూరిటీ మంత్రిని అక్రమంగా నియమించారని కామెంట్
  • విదేశీ ఉద్యోగులను తీసుకోకుండా రూల్ తెచ్చిన ట్రంప్
డొనాల్డ్ ట్రంప్ హయాంలో మార్చిన హెచ్1బీ వీసా నిబంధనలను అమెరికా ఫెడరల్ కోర్ట్ కొట్టేసింది. అమెరికన్ల స్థానంలో తక్కువ జీతాలకు పనిచేసే విదేశీ ఉద్యోగులను తీసుకోకుండా మాజీ అధ్యక్షుడు ట్రంప్ గత ఏడాది కొత్త నిబంధనలను తీసుకొచ్చారు. లాటరీ పద్ధతిలో ఎక్కువ వేతనాలుండే ఉద్యోగాలకు అమెరికన్లను తీసుకొనేలా రూల్స్ ను మార్చారు.

అయితే, ఈ నిబంధన వల్ల ప్రతిభ కలిగిన విదేశీయులు, విదేశీ విద్యార్థులను ఉద్యోగాల్లోకి తీసుకోవడం కష్టంగా మారుతుందని సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇమిగ్రేషన్, నేషనాలిటీ యాక్ట్ కు విరుద్ధమని చాంబర్ ఆఫ్ కామర్స్ తో పాటు పిటిషనర్లు వాదించారు.

గత ఏడాది డిసెంబర్ లో అమెరికా జిల్లా కోర్టు ఆ నిబంధనలను తాత్కాలికంగా నిలిపేసింది. తాజాగా అసలు ఆ నిబంధనలు చెల్లబోవంటూ ఫెడరల్ కోర్ట్ స్పష్టం చేసింది. ఆ నిబంధనలను ఇచ్చినప్పుడు హోంల్యాండ్ సెక్యూరిటీకి ఇన్ చార్జి మంత్రిని అక్రమంగా నియమించారని, కాబట్టి ఆ రూల్స్ చెల్లవని తేల్చి చెప్పింది.
USA
Donald Trump
H1B Visa
Federal Court

More Telugu News