Andhra Pradesh: నిరసన తెలిపేందుకు వెళితే నా కారుపై రాళ్లు రువ్వారు: జోగి రమేశ్​

TDP Leaders Hurled Stones On My Car Alleges Jogi Ramesh
  • నా కారు అద్దాలు ధ్వంసమయ్యాయి
  • చంద్రబాబే క్షమాపణ చెప్పాలి
  • నిరసన కోసం వెళ్తే దండయాత్ర అంటున్నారు
  • అయ్యన్న వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించాలి
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయని, దానిపై నిరసన తెలిపేందుకే చంద్రబాబు ఇంటికి వెళ్లామని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ అన్నారు. దానినే దండయాత్ర అంటూ అయ్యన్న మళ్లీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అయ్యన్న వ్యాఖ్యలపై చంద్రబాబుకు వినతి పత్రం ఇచ్చేందుకే ఆయన ఇంటికి వెళ్లామన్నారు.

ఈ క్రమంలోనే తనపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని, తన కారు అద్దాలు ధ్వంసమయ్యాయని జోగి రమేశ్ ఆరోపించారు. తన కారుపై వారు రాళ్లు రువ్వారని, నిరసన తెలిపే హక్కు కూడా లేదా? అని ప్రశ్నించారు. జగన్ పై అయ్యన్న వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించాలని, లేదంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Andhra Pradesh
Jogi Ramesh
YSRCP
Telugudesam
Chandrababu
Ayyanna Patrudu
YS Jagan

More Telugu News