తాలిబన్ల మరో నిర్వాకం.. మహిళా మంత్రిత్వ శాఖ పేరు మార్పు
- తాలిబన్ల పాలనతో మళ్లీ స్వేచ్ఛను కోల్పోయిన ఆఫ్ఘన్ మహిళలు
- షరియా చట్టాల పేరుతో మహిళలపై తాలిబన్ల ఉక్కుపాదం
- ధర్మ రక్షణ, అధర్మ నిర్మూలన శాఖగా మహిళా శాఖ పేరు మార్పు
తాజాగా తాలిబన్లు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా మహిళా మంత్రిత్వ శాఖ పేరునే మార్చేశారు. గత 20 ఏళ్లుగా ఉన్న మహిళా మంత్రిత్వ శాఖ భవనానికి 'ధర్మ రక్షణ.. అధర్మ నిర్మూలన' శాఖ అని పేరుపెట్టారు. ఈ మేరకు అరబ్బీ, దరి భాషల్లో బోర్డులు ఏర్పాటు చేశారు. తాలిబన్ల కేబినెట్ లో ఒక్క మహిళకు కూడా స్థానం లేకపోవడం గమనార్హం. మరోవైపు ఇటీవలే విమానాశ్రయ సెక్యూరిటీలో 16 మంది మాజీ మహిళా ఉద్యోగులను మళ్లీ నియమించిన తాలిబన్లు... ఇతర శాఖలు, సంస్థల్లో మాత్రం మహిళలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.