నిమిషానికి 42 వేల మందికి కరోనా టీకా.. ఇవాళ ఇప్పటికే 1.23 కోట్ల మందికి!
- ఒకే రోజు కోటి డోసులు నెలలో నాలుగోసారి
- 2 కోట్ల మార్కును దాటేందుకు టార్గెట్
- కొవిన్ పోర్టల్ లో రియల్ టైం అప్ డేట్స్
వ్యాక్సిన్ వేస్తున్న అధికారుల నిరంతర శ్రమతో సెకనుకు 700 మందికి లేదా నిమిషానికి 42 వేల మందికి టీకాలు వేయగలుగుతున్నామని, రియల్ టైంలో వ్యాక్సినేషన్ పురోగతిని ట్రాక్ చేసేందుకు వీలుకల్పించామని నేషనల్ హెల్త్ అథారిటీ అధిపతి ఆర్ఎస్ శర్మ చెప్పారు. కొవిన్ సైట్ లో ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. కాగా, ఇప్పటిదాకా 1.23 కోట్ల మందికి టీకాలు వేశారు. రియల్ టైం ఫీచర్ ను తీసుకురావడంతో సెకనుసెకనుకు కొవిన్ పోర్టల్ లో వ్యాక్సిన్ వేసిన వారి సంఖ్య మారుతోంది.