మూడు రోజుల్లో ఇళ్లు ఖాళీ చేయండి.. తాలిబన్ల హుకుం!
- నిరసనలు చేస్తున్న కాందహార్ ప్రజలు
- స్థానికులకు తాలిబన్ ప్రభుత్వ అధికారుల ఉత్తర్వులు
- ఆఫ్ఘనిస్థాన్ సైన్యం భూముల్లో నివసిస్తున్న ప్రజలకు నోటీసులు
ఇప్పుడు తాజాగా కాందహార్ ప్రాంతంలోని ప్రజలకు తాలిబన్లు ఇచ్చిన ఆదేశాలు గొడవలకు దారితీస్తున్నాయి. ఆఫ్ఘనిస్థాన్ జాతీయ సైన్యానికి చెందిన ఇక్కడి భూముల్లో చాలా మంది ప్రజలు నివసిస్తున్నారు. వీరందరూ ఇళ్లు ఖాళీ చేయాలని తాలిబన్ ప్రభుత్వ అధికారులు హుకుం జారీచేశారు.
ఇలా ఇళ్లు వదిలి వెళ్లడానికి మూడు రోజుల గడువు ఇచ్చారు. అయితే ఈ ఆదేశాలను స్థానిక ప్రజలు అంగీకరించడం లేదు. వీటికి వ్యతిరేకంగా నిరసనలకు దిగారు. తాము ఇక్కడ 20 ఏళ్లుగా ఉంటున్నామని, ఇక్కడ కుటుంబాలను ఏర్పాటు చేసుకున్నామని ప్రజలు అంటున్నారు.