దసరా బరిలోకి 'దృశ్యం 2'?
- దసరా బరి నుంచి తప్పుకున్న 'ఆర్ ఆర్ ఆర్'
- పండగకి 'అఖండ' కూడా రానట్టే
- 'దృశ్యం 2'ను రంగంలోకి దింపే ఆలోచన
- త్వరలో రానున్న క్లారిటీ
కానీ అప్పటికీ 'అఖండ' సినిమాకి సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యే అవకాశం లేదట. అందువలన దసరాకి 'అఖండ' రావడం లేదనే విషయం తేలిపోయినట్టే. దాంతో ఆ తేదీన 'దృశ్యం 2' సినిమాను విడుదల చేస్తే బాగుంటుందనే ఆలోచనలో సురేశ్ బాబు ఉన్నారని చెప్పుకుంటున్నారు.
అయితే ఈ విషయంలో ఇంకా క్లారిటీ రావలసి ఉంది. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, వెంకటేశ్ సరసన నాయికగా మీనా నటించింది. మలయాళంలో వచ్చిన 'దృశ్యం 2'కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. తెలుగులో ఎలాంటి రిజల్టును రాబడుతుందో చూడాలి మరి.