lawyer: కోర్టు గదిలో పేలిపోయిన న్యాయవాది ఫోన్.. న్యాయపోరాటానికి సిద్ధం!

Lawyer one plus smart phone blasted in lawyer pocket in delhi
  • విచారణ జరుగుతుండగా పేలిన ఫోన్
  • న్యాయవాదికి గాయాలు
  • న్యాయపోరాటం చేస్తానన్న గౌరవ్ గులాటి
కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ఓ న్యాయవాది జేబులోని స్మార్ట్‌ఫోన్ పేలిపోయింది. ఢిల్లీలో జరిగిందీ ఘటన. దేశ రాజధానికి చెందిన న్యాయవాది గౌరవ్ గులాటి ఇటీవల వన్‌ప్లస్ నార్డ్-2 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేశారు. ఆయన కోర్టు గదిలో ఉన్న సమయంలో జేబులో ఉన్న ఫోన్ నుంచి తొలుత మంట వచ్చింది. ఆ తర్వాత క్షణాల్లోనే అది పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఈ ఘటనలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి.

ఈ ఘటనపై గులాటి మాట్లాడుతూ.. ఫోన్ పేలిన విషయమై వన్‌ప్లస్ సంస్థను తాను సంప్రదించబోనని పేర్కొన్నారు. కానీ, ఆ సంస్థపై నేరుగా న్యాయపోరాటం చేస్తానని చెప్పారు. మరోవైపు, ఈ ఘటనపై వన్‌ప్లస్ సంస్థ స్పందించింది. ఫోన్‌ను పరీక్షించకుండా పరిహారం చెల్లించలేమని పేర్కొంది. ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు గౌరవ్‌ను సంప్రదిస్తే ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలిపింది.
lawyer
New Delhi
Oneplus Smart Phone
Blast

More Telugu News