పశ్చిమబెంగాల్ అడ్వొకేట్ జనరల్ రాజీనామా
- ఏజీ పదవికి కిశోర్ దత్త రాజీనామా
- రాజీనామాను ఆమోదించిన రాష్ట్ర గవర్నర్
- 2017లో ఏజీగా బాధ్యతలను స్వీకరించిన దత్త
మమత సీఎం అయిన తర్వాత అడ్వొకేట్ జనరల్ గా బాధ్యతలను స్వీకరించిన నాలుగో వ్యక్తి దత్త. దీదీ సీఎం అయిన తర్వాత ఆనింద్య మిత్ర తొలి ఏజీగా పని చేయగా... ఆ తర్వాత బిమాల్ ఛటర్జీ, జయంత మిత్ర కొనసాగారు. ఇప్పుడు కిశోర్ దత్త కూడా రాజీనామా చేయడంతో ఐదో వ్యక్తికి ఆ బాధ్యతలను నిర్వహించే అవకాశం వచ్చింది.