Akshra Singh: నన్ను చంపేస్తానన్నాడు.. యాసిడ్ పోయాలని చూశాడు: నటి అక్షర సింగ్

Bollywood Actress Akshra Singh reveal about her breakup
  • వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డా
  • తొలినాళ్లలో ఆఫర్లు వచ్చినట్టే వచ్చి చేజారిపోయేవి
  • ఎంతో మానసిక క్షోభకు గురయ్యా
  • తండ్రి నింపిన ధైర్యంతోనే బతికేస్తున్నా
వ్యక్తిగత జీవితంలో తాను ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని బాలీవుడ్ నటి అక్షర సింగ్ తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. తాను ఎంతగానో అభిమానించే వ్యక్తే తనను మట్టుబెట్టాలని చూశాడని గుర్తు చేసుకున్నారు. నటిగా కెరియర్‌ను ప్రారంభించాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులను ఒప్పించి మరీ ముంబైకి వచ్చి అష్టకష్టాలు పడ్డానని వివరించారు. నిజానికి తాను పడిన కష్టాలు మరే అమ్మాయికి రాకూడదని కోరుకున్నారు. కొత్తలో తనకు ఆఫర్లు వచ్చినట్టే వచ్చి చేజారిపోయేవని పేర్కొన్నారు.

అదే సమయంలో ఓ వ్యక్తితో తనకు బ్రేకప్ జరిగిందని, అతడు కూడా తనను చాలా ఇబ్బందులు పెట్టాడని గుర్తు చేసుకున్నారు. తనను చంపేస్తానని బెదిరించడమే కాకుండా, యాసిడ్ దాడి చేయిస్తానని హెచ్చరించాడని పేర్కొన్నారు. అప్పట్లో తాను ఎదుర్కొన్న మానసిక క్షోభ చెప్పనలవి కాదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఆ సమయంలో తండ్రి తనలో ధైర్యాన్ని నింపారని, ఆయనిచ్చిన ధైర్యంతోనే కెరియర్‌లో రాణిస్తున్నానని అక్షర సింగ్ తెలిపారు. కాగా, ‘సత్యమేవ్ జయతే’, ‘సథియా’, ‘ధడ్కన్’, ‘మా తుజే సలామ్’ వంటి సినిమాల్లో  అక్షర సింగ్ నటించారు.
Akshra Singh
Actress
Bollywood
Love
Acid

More Telugu News