తెలంగాణలో తాజాగా 249 మందికి కరోనా
- గత 24 గంటల్లో 53,789 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 82 మందికి పాజిటివ్
- రాష్ట్రంలో ఇద్దరి మృతి
- ఇంకా 5,258 మందికి చికిత్స
అదే సమయంలో 313 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,61,551 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,52,398 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,258 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనా మృతుల సంఖ్య 3,895కి పెరిగింది.
