Sai Dharam Tej: సాయితేజ్‌ కాలర్‌బోన్‌కు శస్త్రచికిత్సపై నేడు నిర్ణయం తీసుకోనున్న వైద్యులు

Doctors making the decision today on surgery for Saitej collarbone
  • నిలకడగానే సాయితేజ్ ఆరోగ్యం
  • శరీరం లోపల ఎలాంటి రక్తస్రావం లేదని నిర్ధారణ
  • వైద్య పరీక్షల ఫలితాల అనంతరం ఆపరేషన్‌పై నిర్ణయం
హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టాలీవుడ్ ప్రముఖ నటుడు సాయితేజ్‌ కాలర్‌బోన్‌కు శస్త్రచికిత్స చేసే విషయంలో అపోలో వైద్యులు నేడు నిర్ణయం తీసుకోనున్నారు. సాయితేజ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. చికిత్సకు స్పందిస్తున్నారు. ప్రమాదంలో శరీరం లోపల ఎలాంటి రక్తస్రావం కాలేదని వైద్యులు ఇప్పటికే నిర్ధారించారు. ఈ నేపథ్యంలో వైద్య పరీక్షల ఫలితాలను పూర్తిస్థాయిలో పరిశీలించిన అనంతరం కాల్‌బోన్ శస్త్రచికిత్సపై నిర్ణయం తీసుకుంటామని వైద్యులు తెలిపారు.
Sai Dharam Tej
Tollywood
Hyderabad
Apollo Hospital

More Telugu News