ఏపీ, చత్తీస్‌గఢ్, ఝార్ఖండ్‌లకు ప్రత్యేక హోదా ఇవ్వండి.. కేంద్రానికి విజయసాయి నేతృత్వంలోని స్థాయీ సంఘం సిఫార్సు
- విడగొట్టిన తర్వాత జమ్మూకశ్మీర్, లడఖ్‌కు బోల్డన్ని నిధులు కేటాయించారు
- ఏపీ, చత్తీస్‌గఢ్, ఝార్ఖండ్‌లకు అలాంటి పరిహారమే ఇవ్వండి
- పదేళ్లపాటు ప్రత్యేక హోదా ప్రకటించండి
- దక్షిణ కోస్తా రైల్వే జోన్ నుంచి వాల్తేరు డివిజన్‌ను విడగొట్టొద్దు
- రాజ్యసభ చైర్మన్‌కు అందించిన నివేదికలో స్థాయీ సంఘం
ఈ కేటాయింపుల వల్ల ఆ రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశం ఉందన్న స్థాయీ సంఘం.. ఇలాంటి పరిహారాన్నే రాజధానులు కోల్పోయిన ఏపీ, చత్తీస్‌గఢ్, ఝార్ఖండ్‌లకు కూడా ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడింది. అలాగే, పదేళ్లపాటు ఈ మూడు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలని సిఫార్సు చేసింది. కొత్తగా ఏర్పాటు చేసే దక్షిణ కోస్తా రైల్వే జోన్ నుంచి వాల్తేరు డివిజన్‌ను విడగొట్టొద్దని కూడా కోరింది. కొత్త జోన్ ఏర్పాటుకు సంబంధించి డీపీఆర్ ఇంకా పరిశీలన దశలోనే ఉండడంపై స్థాయీ సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వాల్తేరు డివిజన్‌ను ఎందుకు విడగొట్టాల్సి వస్తుందో తమకు అర్థం కావడం లేదన్నారు. కాబట్టి ఈ నిర్ణయాన్ని పునస్సమీక్షించాలని కోరింది. మిరప ఎగుమతులకు కేంద్రమైన గుంటూరులో శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయాలని స్థాయీ సంఘం ఆ నివేదికలో కేంద్రానికి సిఫార్సు చేసింది.