గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ రాజీనామా

  • గుజరాత్ రాజకీయాల్లో ప్రకంపనలు
  • గవర్నర్ కు రాజీనామా లేఖ అందజేత
  • రూపానీ నిర్ణయంపై తీవ్ర చర్చ
  • వచ్చే ఏడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు
గుజరాత్ రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. గుజరాత్ సీఎం విజయ్ రూపానీ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కొద్దిసేపటి క్రితం గవర్నర్ ఆచార్య దేవవ్రత్ కు అందజేశారు. వచ్చే ఏడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా, ఇప్పటికిప్పుడు విజయ్ రూపానీ రాజీనామా చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇటీవల కాలంలో రాజీనామా చేసిన నాలుగో బీజేపీ సీఎం విజయ్ రూపానీ. జులైలో కర్ణాటక సీఎం పదవికి బీఎస్ యడియూరప్ప రాజీనామా చేయగా, ఉత్తరాఖండ్ లో తీర్థ్ సింగ్ రావత్, త్రివేంద్ర సింగ్ రావత్ సీఎం పదవి నుంచి వైదొలిగారు. తాజాగా, విజయ్ రూపానీ సీఎం పదవి నుంచి తప్పుకోవడానికి దారితీసిన కారణాలు ఏంటన్నది తెలియరాలేదు.

Vijay Rupani
CM
Gujarat
Resignation
BJP

More Telugu News