Andhra Pradesh: ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

Corona cases in AP increasing again
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 62,856 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా 1,439 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 261 కేసులు.. కర్నూలు, విజయనగం జిల్లాలలో అత్యల్పంగా 8 కేసుల చొప్పున నమోదయ్యాయి.

ఇదే సమయంలో 14 మంది కరోనా కారణంగా మృతి చెందారు. 1,311 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,26,042కి చేరుకుంది. ఇప్పటి వరకు 19,97,454 మంది కోలుకున్నారు. అలాగే ఇంతవరకు 13,964 మంది కరోనా వల్ల చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,624 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Updates

More Telugu News