పారాలింపిక్స్ పతకధారులతో ముచ్చటించిన ప్రధాని నరేంద్ర మోదీ
- ఇటీవల ముగిసిన టోక్యో పారాలింపిక్స్
- 19 పతకాలు సాధించిన భారత్
- వాటిలో 5 స్వర్ణాలు
- ఢిల్లీలో పారా అథ్లెట్లతో భేటీ
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పారాలింపిక్స్ పతకధారులతో ఆయన ఆప్యాయంగా ముచ్చటించారు. టోక్యో క్రీడోత్సవ విశేషాలను వారిని అడిగి తెలుసుకున్నారు. దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేశారంటూ పేరుపేరునా అభినందించారు. భవిష్యత్తులోనూ మరింత మెరుగైన ప్రదర్శన చేయాలని ఆకాంక్షించారు.

