దుబాయ్ షేక్ నోట ‘సిరివెన్నెల’ పాట!
- అక్షరం పొల్లుపోకుండా చక్కగా ఆలపించిన దుబాయ్ షేక్
- టిక్‌టాక్‌లో షేర్ చేయడంతో వైరల్
- ఫిదా అవుతున్న తెలుగు సినీ ప్రియులు
1986లో వచ్చిన ‘సిరివెన్నెల’ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోని పాటలన్నీ ఆణిముత్యాలే. ఈ సినిమాకు పాటలు రాసిన సీతారామశాస్త్రి తన ఇంటి పేరునే ‘సిరివెన్నెల’గా మార్చుకున్నారు. ఇక ఇందులోని ‘విధాత తలపున’ అనే పాట అప్పట్లో ఎంత పాప్యులర్ అయిందో, ఇప్పుడు అంతకంటే ఎక్కువగా అది ఇంటర్నెట్ను చుట్టేస్తోంది. కారణం.. ఓ దుబాయ్ షేక్ ఆ పాటను ఆలపించడమే!
ఆ పాటను ఏమాత్రం పొల్లుపోకుండా, లయ తప్పకుండా ఆయన చక్కగా ఆలపించారు. టిక్‌టాక్‌లో ఆయన షేర్ చేసిన వీడియో ఇతర సామాజిక మాధ్యమాలకూ పాకేసింది. ఇది చూసిన తెలుగు సినీ ప్రియులు ‘ఔరా!’ అంటున్నారు. మీరూ వినండి మరి.