Andhra Pradesh: సినిమా టికెట్ల విక్రయానికి ఆన్ లైన్ పోర్టల్ ను తీసుకొస్తున్న ఏపీ ప్రభుత్వం

AP Govt to start online portal for movie tickets booking
  • టికెట్ల బుకింగ్ కోసం వెబ్ సైట్ ప్రారంభించనున్న రాష్ట్ర ప్రభుత్వం
  • రైల్వే ఆన్ లైన్ టికెటింగ్ సిస్టమ్ తరహాలో పోర్టల్
  • రాష్ట్ర ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పర్యవేక్షిస్తుందన్న ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ప్రేక్షకులు సినిమా టికెట్లను బుక్ చేసుకునేందుకు ఆన్ లైన్ వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. త్వరలోనే ఆన్ లైన్ పోర్టల్ ను ప్రారంభించబోతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం జీవోను విడుదల చేసింది.

రైల్వే ఆన్ లైన్ టికెటింగ్ సిస్టమ్ తరహాలో పోర్టల్ ను అభివృద్ది చేయబోతున్నట్టు జీవోలో ప్రభుత్వం పేర్కొంది. ఈ వ్యవహారాలను రాష్ట్ర ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పర్యవేక్షిస్తుందని తెలిపింది. దీనికి సంబంధించిన విధివిధానాలు, అభివృద్ధి, అమలు ప్రక్రియను ప్రభుత్వం నియమించే కమిటీ చూసుకుంటుందని చెప్పింది.
Andhra Pradesh
Movie Tickets
Online
Government Portal

More Telugu News