Nimmagadda Prasad: వాన్‌పిక్ కేసు నిందితుడు నిమ్మగడ్డ ప్రసాద్‌కు సీబీఐ కోర్టులో ఊరట

VANPIC Case CBI Court Gave Relief to Nimmagadda Prasad
  • వ్యాపార కార్యకలాపాల నిమిత్తం బెయిలు షరతులు సడలించాలని పిటిషన్
  • రూ. 5 లక్షల పూచీకత్తు, అంతే మొత్తానికి మరో రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశం
  • బెయిలు షరతుల సడలింపు
ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌కు సీబీఐ కోర్టులో ఊరట లభించింది. జగన్ అక్రమాస్తులకు సంబంధించి నమోదైన వాన్‌పిక్ కేసులో నిందితుడైన నిమ్మగడ్డ.. వ్యాపార కార్యకలాపాల నిమిత్తం వచ్చే ఏడాది మార్చి వరకు ఆరు నెలలపాటు దేశంలో ఎక్కడికైనా వెళ్లేందుకు వీలుగా  బెయిలు షరతులు సడలించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌ను నిన్న విచారించిన సీబీఐ కోర్టు న్యాయమూర్తి బీఆర్ మధుసూదన్‌రావు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. 5 లక్షల రూపాయల పూచీకత్తుతోపాటు అంతే మొత్తానికి మరో రెండు పూచీకత్తులను సమర్పించాలని ఆదేశిస్తూ బెయిలు షరతులను సడలించారు.
Nimmagadda Prasad
CBI Court
VANPIC
YS Jagan

More Telugu News