Kangana Ranaut: మల్టీప్లెక్స్ అసోసియేషన్ నాపై విద్వేషం ప్రదర్శిస్తోంది: కంగన రనౌత్

Kangana allegations on Multiplex Association Of India
  • జయలలిత జీవితంపై 'తలైవి' చిత్రం
  • ప్రధానపాత్ర పోషించిన కంగన 
  • మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాపై ఆగ్రహం
  • 'తలైవి' విడుదలకు సహకరించడంలేదని ఆరోపణ
బాలీవుడ్ తార కంగన రనౌత్ మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్టీప్లెక్స్ అసోసియేషన్ తనపై విద్వేషం ప్రదర్శిస్తోందని వ్యాఖ్యానించారు. తాను నటించిన 'తలైవి' చిత్రాన్ని హిందీలో విడుదల చేసేందుకు సహకరించడం లేదని ఆరోపించారు. హీరోలు, హీరోయిన్ల చిత్రాల మధ్య వివక్ష చూపడం సరికాదని కంగన అభిప్రాయపడ్డారు. మల్టీప్లెక్స్ అసోసియేషన్ లో వర్గపోరు నడుస్తోందని, ఇది మంచి పరిణామం కాదని స్పష్టం చేశారు.

తన భవిష్యత్ ప్రణాళికల గురించి చెబుతూ, రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశం లేదని కంగన వెల్లడించారు. అన్ని భాషల్లో ఇంకా చాలా మంచి సినిమాలు చేయాలని ఆకాంక్ష వెలిబుచ్చారు.

తమిళనాడు మాజీ సీఎం జయలలిత జీవిత ప్రస్థానం ఆధారంగా 'తలైవి' చిత్రం తెరకెక్కడం తెలిసిందే. ఆ బయోపిక్ లో కంగన జయలలిత పాత్ర పోషించారు.
Kangana Ranaut
Multiplex Association Of India
Thalaivi
Release
India

More Telugu News