Shane Warne: ప్రపంచంలో అత్యుత్తమ టెస్టు జట్టు ఇదే: షేన్ వార్న్

Team India is worlds best test team says Shane Warne
  • టీమిండియా మరో అద్భుత విజయాన్ని సాధించిందన్న వార్న్
  • 12 నెలలుగా అద్భుతాలు సాధిస్తున్నారని కితాబు
  • ప్రపంచంలో అత్యుత్తమ టెస్టు జట్టు టీమిండియానే అని ప్రశంస
ఇంగ్లండ్ తో ఓవల్ మైదానంలో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 157 పరుగుల తేడాతో గెలుపొందిన టీమిండియా... ఐదు టెస్టుల సిరీస్ లో 2-1 ఆధిక్యాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో భారత జట్టుపై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి. ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ కూడా భారత జట్టుపై ప్రశంసలు కురిపించాడు.

ట్విట్టర్ ద్వారా వార్న్ స్పందిస్తూ... మరో అద్భుతమైన విజయం సాధించిన టీమిండియాకు అభినందనలు అని చెప్పాడు. గత 12 నెలలుగా మీరు సాధించినది కచ్చితంగా అద్భుతమైనదని కితాబునిచ్చాడు. ప్రపంచంలో అత్యుత్తమ టెస్టు జట్టు టీమిండియానే అని చెప్పాడు. మరోవైపు చివరి టెస్టు మాంచెస్టర్ వేదికగా సెప్టెంబర్ 10న ప్రారంభం కానుంది.
Shane Warne
Australia
Team India
Test Cricket
Best Team

More Telugu News