Congress: రాహుల్ గాంధీని కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించాలంటూ యువజన కాంగ్రెస్ తీర్మానం

Indian Youth Congress passes resolution to make Rahul Gandhi party president
  • గోవాలో రెండు రోజులపాటు ఐవైసీ సమావేశాలు
  • వివిధ అంశాలపై చర్చ, తీర్మానాలు
  • నిరుద్యోగం, అధిక ధరలపై దేశవ్యాప్త ఆందోళనలు
రెండు రోజులపాటు గోవాలో నిర్వహించిన భారతీయ యువజన కాంగ్రెస్ (ఐవైసీ) కార్యవర్గ సమావేశాలు నిన్న ముగిశాయి. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఐవైసీ జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ బీవీ విలేకరులకు వెల్లడించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని పార్టీ అధ్యక్షుడిని చేయాలని ఐవైసీ ఏకగ్రీవంగా తీర్మానించినట్టు పేర్కొన్నారు. నిరుద్యోగం, అధిక ధరలు వంటి అంశాలపై దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టనున్నట్టు తెలిపారు. అలాగే, సంస్థాగత ఎన్నికల నిర్వహణ, కొత్త సభ్యులను చేర్పించే కార్యక్రమం వంటి వాటిపై సమావేశంలో చర్చించినట్టు శ్రీనివాస్ వివరించారు.
Congress
Rahul Gandhi
Goa
IYC

More Telugu News