Teenmaar Mallanna: తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ కార్యాలయంలో మళ్లీ సోదాలు.. కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం!

Police searches in Teenmar Mallanna Q News
  • ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న తీన్మార్ మల్లన్న
  • వరుసగా మూడోసారి ఆయన కార్యాలయంలో సోదాలు
  • కొవిడ్‌కు చికిత్స తీసుకున్న డాక్టర్‌నూ విచారించిన పోలీసులు
తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ కార్యాలయంలో సీసీఎస్ పోలీసులు నిన్న సోదాలు నిర్వహించారు. ఆయన కార్యాలయంలో సోదాలు నిర్వహించడం ఇది మూడోసారి. నిన్న సోదాల అనంతరం 10 కంప్యూటర్లు, 15 హార్డ్ డిస్కులు, కేబుల్ పత్రాలు, పుస్తకాలు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.

కాగా, ఓ కేసులో గత నెల 27న అరెస్ట్ అయిన మల్లన్న ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్నారు. మల్లన్నకు గతంలో కొవిడ్‌ సోకగా పీర్జాదిగూడలోని కెనరానగర్‌లో ప్రజా క్లినిక్ నిర్వహిస్తున్న డాక్టర్ ఇమ్మాన్యుయేల్‌ వద్ద చికిత్స తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన పోలీసులు డాక్టర్ ఇమ్మాన్యుయేల్‌ను కూడా విచారించి వివరాలు రాబట్టినట్టు సమాచారం.
Teenmaar Mallanna
Hyderabad
Q News
Police

More Telugu News