CM KCR: కేంద్ర జలశక్తి మంత్రితో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశం

Telangana CM KCR met union minister Gajendra Singh Shekawat
  • ఢిల్లీలో బిజీగా సీఎం కేసీఆర్
  • వరుసగా కేంద్రం పెద్దలతో భేటీ
  • షెకావత్ తో నీటి అంశాలపై చర్చ
  • ఏపీతో వివాదాలపై వివరణ
సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో భేటీ అయ్యారు. ఏపీతో జల వివాదాలపై చర్చించారు. ఇటీవల కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ పై తెలంగాణ అభ్యంతరాలను షెకావత్ కు వివరించారు. కృష్ణా నది నుంచి తెలంగాణ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులపై తమ వాదనలను వినిపించారు.

కాగా, గత 5 రోజులుగా ఢిల్లీలోనే ఉన్న సీఎం కేసీఆర్ కేంద్రం పెద్దలను కలుస్తూ పలు అంశాలపై చర్చలు జరిపారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలను కలిశారు. అంతకుముందు, ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమిపూజలో పాల్గొన్నారు.
CM KCR
Gajendra Singh Shekhawat
New Delhi
Telangana
Andhra Pradesh

More Telugu News