Mukesh Ambani: ఒక్కరోజులో 3.71 బిలియన్ డాలర్లు పెరిగిన ముఖేశ్ అంబానీ సంపద

Huge raise in wealth for Mukesh Ambani in a single day
  • రిలయన్స్ షేర్ల దూకుడు
  • సెప్టెంబరు 3న భారీగా పెరిగిన సంపద
  • 92.6 బిలియన్ డాలర్లకు చేరిన నికర ఆస్తి
  • ప్రపంచ కుబేరుల జాబితాలో 12వ స్థానంలో అంబానీ
కరోనా పరిస్థితుల్లోనూ రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యాధినేత ముఖేశ్ అంబానీ సంపద భారీగా పెరిగింది. ఈ నెల 3న ఆయన సంపద ఒక్కదుటున 3.71 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. తద్వారా ఆయన నికర ఆస్తుల మొత్తం విలువ 92.6 బిలియన్ డాలర్లకు చేరింది. ప్రస్తుతం ముఖేశ్ అంబానీకి ప్రపంచ సంపన్నుల జాబితాలో 12వ స్థానం దక్కింది. ఈ మేరకు బ్లూంబెర్గ్ వెల్లడించింది.

రిలయన్స్ షేర్ల ధరలు భారీగా పెరగడంతో అంబానీ సంపద అమాంతం పెరిగినట్టు తెలుస్తోంది. స్టాక్ మార్కెట్లో రిలయన్స్ ఇదే ఒరవడి కొనసాగిస్తే త్వరలోనే అంబానీ 100 బిలియన్ డాలర్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
Mukesh Ambani
Wealth
Single Day
Reliance
Shares

More Telugu News