Andhra Pradesh: ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

Corona cases in AP decreased drastically
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గత 24 గంటల్లో 43,594 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా 739 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వీటిలో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 166 కేసులు నమోదు కాగా... కర్నూలు జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం.

ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 1,333 మంది కరోనా నుంచి కోలుకోగా, 14 మంది మృతి చెందారు. తాజా గణాంకాలతో కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,22,064కి చేరుకుంది. ఇప్పటి వరకు 19,93,589 మంది కోలుకున్నారు. మొత్తం 13,925 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,550 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
updates

More Telugu News