Vijay Sethupathi: కృతి శెట్టిని నా పక్కన హీరోయిన్ గా ఊహించుకోలేను: విజయ్ సేతుపతి

I never imagine Krithi Shetty as my heroine says Vijay Sethupathi
  • తమిళంలో సినిమాకు హీరోయిన్ గా కృతిని తీసుకోవాలనుకున్నారు
  • ఆమెకు నేను తండ్రిగా నటించాను
  • కూతురిగా నటించిన కృతితో జతకట్టలేనని చెప్పాను
వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటించిన 'ఉప్పెన' సినిమా ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో కృతి శెట్టి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది. తొలి చిత్రంతోనే కృతి శెట్టి క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. మరోవైపు 'ఉప్పెన' చిత్రంలో కృతి శెట్టికి తండ్రిగా విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి మాట్లాడుతూ, 'ఉప్పెన'లో బేబమ్మ (కృతి శెట్టి) పాత్రకు తండ్రిగా నటించానని చెప్పారు. తాను తమిళంలో చేయబోతున్న సినిమాలో కృతి శెట్టిని హీరోయిన్ గా తీసుకుంటే బాగుంటుందని భావించి దర్శకనిర్మాతలు ఆమె ఫొటోను పంపారని తెలిపారు. అయితే, వారికి తాను వెంటనే ఫోన్ చేశానని... ఇటీవలే ఆమెకు తండ్రిగా నటించానని, కూతురు పాత్రను పోషించిన ఆమెతో రొమాన్స్ చేయలేనని చెప్పానని అన్నారు. తన హీరోయిన్ గా ఆమెను ఊహించుకోలేనని స్పష్టంగా చెప్పానని తెలిపారు.

సినిమా షూటింగ్ సమయంలో ఎమోషనల్ సీన్స్ చేసే సమయంలో కృతి కంగారు పడిందని... అయితే, 'నాకు నీ వయసు కొడుకున్నాడు. నీవు నా కూతురులాంటి దానివి. భయపడకుండా ధైర్యంగా చెయ్యి' అని చెప్పానని విజయ్ చెప్పారు. కూతురిలా భావించిన ఆమెతో తాను జతకట్టలేనని అన్నారు.
Vijay Sethupathi
Krithi Shetty
Tollywood
Kollywood

More Telugu News