Tollywood: లండన్​ లో రచయితగా ‘గీతాంజలి’ హీరోయిన్​

Geetanjali Heroine Girija Settled As a Writer In London
  • తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసిన గిరిజా శెట్టార్
  • 2005 నుంచి జర్నలిస్ట్ గానూ విధులు
  • మణిరత్నం, సుహాసినిల పెళ్లితోనే ఆమెకు ఆఫర్
గీతాంజలి.. ప్రేమకథల్లో ట్రెండ్ సృష్టించిన సినిమా అది. నాగార్జున హీరోగా, గిరిజా శెట్టార్ హీరోయిన్ గా 1989లో విడుదలైన ఆ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ ఆ సినిమా అంటే ఇష్టపడని యూత్ ఉండరంటే అతిశయోక్తి కాదేమో. జాతీయ స్థాయిలో ఈ సినిమా ఎన్నో అవార్డులనూ సొంతం చేసుకుంది. అయితే, ఒక్క సినిమాతోనే ఎంతో స్టార్ డం కొట్టేసిన అలనాటి ఈ హీరోయిన్ ఆ సినిమా తర్వాత తెలుగులో మళ్లీ కనిపించలేదు. కొన్ని మలయాళ సినిమాలు చేసినా.. తర్వాత పెళ్లి చేసుకుని లండన్ వెళ్లిపోయింది.

కళ్లతోనే అందరినీ కట్టిపడేసిన ఆమె.. ఇప్పుడు ఎక్కడ ఉన్నారో.. ఎలా ఉన్నారో.. ఏం చేస్తున్నారో తెలుసా? ఆమె పూర్తి పేరు గిరిజా ఎమ్మా జేన్ షెట్టార్. ప్రస్తుతం ఆమె లండన్ లో ఉంటోంది. రచయితగా రాణిస్తోంది. 2005 నుంచి ఆరోగ్యం, మానవ సంబంధాలపై ఫ్రీలాన్స్ విలేకరిగానూ పనిచేస్తోంది.


అంత స్టార్ డం తెచ్చి పెట్టిన గీతాంజలి సినిమా ఆఫర్ ఆమెకు ఎలా వచ్చిందో తెలుసా? క్రికెటర్ శ్రీకాంత్ చెల్లెలితో కలిసి మణిరత్నం, సుహాసినిల పెళ్లికి వెళ్లిందట. ఆ పెళ్లిలోనే గిరిజను చూసిన మణిరత్నం.. గీతాంజలి ఆఫర్ ఇచ్చాడట. ఆమె కూడా వెంటనే ఓకే అనేసిందట.
Tollywood
Kollywood
Mani Ratnam
Geetanjali
Nagarjuna
Girija Shettar

More Telugu News