సీబీఐ విచారణ వివరాలు వెల్లడించిన కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి
- వివేకా హత్యకేసులో సీబీఐ దర్యాప్తు
- నిన్న రవీంద్రనాథ్ రెడ్డిని విచారించిన అధికారులు
- గంటసేపు ప్రశ్నించిన వైనం
- వివరాలు మీడియాకు తెలిపిన రవీంద్రనాథ్ రెడ్డి
వివేకాతో తన సంబంధాలపై ప్రశ్నించారని, ఆయన ఎలా నడుచుకునేవారంటూ ఆరా తీశారని పేర్కొన్నారు. ఎంతో అవమానంగా ఉంది, కేసు త్వరగా తేల్చండి అని సీబీఐ అధికారులను కోరానని రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. సాధ్యమైనంత త్వరలో కేసును ఓ కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సీబీఐ అధికారులు బదులిచ్చారని వివరించారు.