పొలం దున్నుతుండ‌గా బ‌య‌ట‌ప‌డ్డ దేవ‌తామూర్తుల విగ్ర‌హాలు.. చూసేందుకు భారీగా త‌ర‌లివ‌స్తోన్న ప్ర‌జ‌లు

farmerl fines idols in farm gannavaram
  • ప్ర‌కాశం జిల్లా వెలిగండ్ల మండ‌లం గ‌న్న‌వ‌రంలో ఘ‌ట‌న‌
  • అంబ‌య్య అనే రైతు పొలం దున్నుతుండ‌గా విగ్ర‌హాలు ల‌భ్యం
  • పొలంలో ల‌క్ష్మీదేవి, కృష్ణుడి విగ్ర‌హాలకు పూజ‌లు
ప్ర‌కాశం జిల్లా వెలిగండ్ల మండ‌లం గ‌న్న‌వ‌రంలో అంబ‌య్య అనే రైతు పొలం దున్నుతుండ‌గా పురాత‌న విగ్ర‌హాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. పొలంలో ల‌క్ష్మీదేవి, కృష్ణుడి విగ్ర‌హాలు ల‌భ్యం కావ‌డంతో ఆ రైతు వాటిని పొలం వ‌ద్దే ఉంచాడు. దీంతో దేవతామూర్తుల విగ్ర‌హాల‌ను చూసేందుకు స‌మీప గ్రామాల ప్ర‌జ‌లు భారీగా అక్క‌డ‌కు త‌ర‌లివ‌స్తున్నారు. ల‌క్ష్మీదేవి, కృష్ణుడి విగ్ర‌హాలకు స్థానికులు కూడా పూజ‌లు చేస్తున్నారు. గ‌న్న‌వ‌రానికి భారీగా ప్ర‌జ‌లు త‌ర‌లివ‌స్తుండ‌డంతో అక్క‌డ సంద‌డి నెల‌కొంది.
Go Back to Shorts
farmer
Prakasam District

More Telugu News