కృష్ణా జిల్లాలో 14 ఏళ్ల బాలికపై బాలుడు సహా ముగ్గురు వ్యక్తుల అత్యాచారం
- పశువుల పాకలోకి తీసుకెళ్లి అత్యాచారం
- నిందితుల అరెస్ట్
- మచిలీపట్టణం జిల్లా ఆసుపత్రికి బాలిక తరలింపు
గురువారం రాత్రి తమ ఇంటి సమీపంలోని పశువుల పాకలోకి బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్టు బాధిత బాలిక తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేసి బంటుమిల్లి ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ కోర్టుకు అప్పగించారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను మచిలీపట్టణం జిల్లా ఆసుపత్రికి తరలించారు.