మధుమేహం సహా పలు రకాల మందుల ధరలు తగ్గింపు.. రోగులకు ఉపశమనం
- మొత్తం 39 రకాల ఔషధాల ధరలు తగ్గించాలని నిర్ణయం
- మరో 16 రకాల ఔషధాలు ఎన్ఎల్ఈఎం జాబితా నుంచి తొలగింపు
- జాబితాలో చేర్చే ఔషధాల ధరలను నిర్ణయించనున్న ఎన్‌పీపీఏ
మొత్తం 39 రకాల ఔషధాలను ఎన్ఎల్ఈఎంలో చేర్చనున్న ప్రభుత్వం.. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నివారణకు ఉపయోగించే ఎరిత్రోమైసిన్, బ్లీచింగ్ పౌడర్, ఎయిడ్స్ మందులు వంటి 16 రకాల ఔషధాలను తొలగించాలని కూడా ప్రతిపాదించింది. ఈ మందులకు ప్రత్యామ్నాయంగా మెరుగైన మందులు రావడం, మరికొన్ని అసలు వాడుకలోనే లేకపోవడంతో జాబితా నుంచి వీటిని తొలగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.