Women: గతుకుల రోడ్లపై ర్యాంప్ వాక్ చేసిన భోపాల్ మహిళలు

- భోపాల్ లో దారుణంగా తయారైన రోడ్లు
- మరమ్మతులు నిర్వహించని అధికారులు
- మహిళల వినూత్న నిరసన
- అధికారులు చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్
వర్షాకాలం వస్తే రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారడం తెలిసిందే. ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం సకాలంలో చర్యలు తీసుకుంటే సరి... లేకపోతే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోకతప్పదు. అయితే, గతుకుల రోడ్లకు మరమ్మతులు నిర్వహించడం లేదంటూ భోపాల్ లో మహిళలు వినూత్నంగా నిరసన తెలిపారు.
హోషంగాబాద్ రోడ్డు సమీపంలోని దానిష్ నగర్ కాలనీకి చెందిన మహిళలు గతుకుల రోడ్డుపై ఫ్యాషన్ మోడళ్ల తరహాలో ర్యాంప్ వాక్ చేశారు. ఇలాగైనా తమ రోడ్ల పరిస్థితిని అధికారులు గుర్తిస్తారని వారు భావిస్తున్నారు. తమ కాలనీని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేర్చాలని, లేకపోతే ఆస్తి పన్నులు చెల్లించబోమని వారు స్పష్టం చేశారు.
