NASA: 200 మైళ్ల వేగంతో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ.. పరీక్షించిన నాసా!

NASA tests air car in California Flight base
  • కొత్త తరహా రవాణా వ్యవస్థకు తొలి అడుగు
  • జాబీ ఏవియేషన్‌ సెంటర్‌లో నాసా పరీక్షలు
  • టెస్టులు విజయవంతం అయినట్లు వార్తలు
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. ఇటీవలి కాలంలో చాలా మంది వీటిని కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా.. రవాణా వ్యవస్థను మరో మెట్టు ఎక్కించే ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. తాజాగా ఈ సంస్థ.. ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ పరీక్షలు నిర్వహించడం ఆసక్తికరంగా మారింది.

దీంతో కొత్త రకం రవాణా వ్యవస్థ వైపు తొలి అడుగులు పడే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు. విమానం మాదిరిగా ఉన్న ఈ విద్యుత్ వాహనం గంటకు 200 మైళ్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉందట. దీని టెస్ట్‌ డ్రైవ్‌ను జాబీ ఏవియేషన్ సెంటర్‌లో నిర్వహించినట్లు సమాచారం. ఈవీటీఓఎల్ ఎయిర్‌క్రాఫ్ట్ అని పిలుస్తున్న ఈ కారు పరీక్షలను సెప్టెంబరు 10 వరకూ నిర్వహించనున్నారు.

కాలిఫోర్నియాలోని బిగ్ సుర్ జాబీ ఎలక్ట్రిక్ ఫ్లైట్ బేస్‌లో ఈ పరీక్షలు చేస్తున్నట్లు సమాచారం. ఈ పరీక్షలు ప్రస్తుతానికి విజయవంతమైనట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటి ద్వారా వాహనం ఎలా పనిచేస్తుందనే డేటాను సేకరిస్తున్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే భవిష్యత్తులో వీటిని ప్రధాన నగరాల్లో ఎయిర్ ట్యాక్సీలుగా ఉపయోగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
NASA
California
Air Taxi

More Telugu News