టోక్యో పారాలింపిక్స్ లో భారత్ కు బ్యాడ్మింటన్ స్వర్ణం... అదరగొట్టిన ప్రమోద్ భగత్
- పారాలింపిక్స్ లో భారత్ కు మరో పతకం
- బ్యాడ్మింటన్ సింగిల్స్ లో ప్రమోద్ కు పసిడి
- ఫైనల్లో డేనియల్ బెతెల్ పై విజయం
- వరుస గేముల్లో గెలుపు
ప్రమోద్ భగత్ ప్రపంచ పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుల్లో వరల్డ్ నెంబర్ వన్ గా కొనసాగుతున్నాడు. ఇవాళ జరిగిన ఫైనల్లో తన టాప్ ర్యాంకుకు తగిన ఆటతీరు ప్రదర్శించి భారత శిబిరంలో బంగారు కాంతులు నింపాడు.