దళితబంధును ప్రజలు నమ్మే ప్రసక్తే లేదు: డీకే అరుణ
- హుజూరాబాద్ ఉపఎన్నిక కోసమే దళితబంధును తీసుకొచ్చారు
- కులాల పేరుతో ప్రజలను విభజించి లాభం పొందాలనుకుంటున్నారు
- వికారాబాద్ జిల్లా ప్రజలను కేసీఆర్ ముంచేశారు
వికారాబాద్ జిల్లా ప్రజలను సీఎం కేసీఆర్ నిండా ముంచేశారని మండిపడ్డారు. ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల రూపాయలను వెనకేసుకున్నారని... ఆ డబ్బును ఎన్నికల్లో వెదజల్లుతున్నారని ఆరోపించారు. కులాల పేరుతో ప్రజలను విభజించి లాభం పొందాలని కేసీఆర్ యత్నిస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు.