Grandhi Srinivas: జనసేన కార్యకర్తలను తాలిబన్లతో పోల్చిన వైసీపీ ఎమ్మెల్యే

YCP MLA Grandhi Srinivas terms Janasena workers as Taliban
  • జనసైనికులపై గ్రంథి శ్రీనివాస్ వ్యాఖ్యలు
  • విచక్షణ కోల్పోతున్నారని వ్యాఖ్య  
  • ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి అని విమర్శలు
  • పిల్ల చేష్టలు అంటూ కొట్టిపారేసిన వైనం
వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ జనసేన కార్యకర్తలు, నేతలపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఎవరైనా పవన్ కల్యాణ్ గురించి మాట్లాడితే చాలు... జనసేన కార్యకర్తలు విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. భీమవరంలోనే కాదు, ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ఉందన్నారు. జనసేన కార్యకర్తలకు, తాలిబన్లకు తేడా ఏమీలేదని విమర్శించారు.

"ఇప్పుడు నేను కొత్తగా చెప్పడం కాదు... జనసేన కార్యకర్తల తీరు గురించి గతంలో అల్లు అర్జున్, నాగబాబు స్వయంగా చెప్పారు. జనసేన నేతలు పిల్లచేష్టలకు పాల్పడుతున్నారు" అని గ్రంథి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.

గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత పవన్ కల్యాణ్ మళ్లీ భీమవరం ప్రజలకు కనిపించలేదని, ఆయన ఎందుకు కనిపించలేదన్న విషయాన్ని జనసేన కార్యకర్తలు ఓ బ్యానర్ వేసి ప్రజలకు తెలియజేస్తే బాగుంటుందని హితవు పలికారు. భీమవరంలో అభివృద్ధి కుంటుపడింది అంటూ జనసేన పార్టీ నేతలు ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంపై ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తాజా వ్యాఖ్యలు చేశారు.
Grandhi Srinivas
Janasena Workers
Taliban
Bheemavaram
YSRCP

More Telugu News