తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. 14 రకాల వంటకాలతో భోజనం!
- ఏపీ, తమిళనాడు, కర్ణాటక కూరగాయల దాతలతో అదనపు ఈవో ధర్మారెడ్డి సమావేశం
- ఒక్కో యూనిట్‌కు 48 కిలోల చొప్పున కూరగాయలు అవసరం
- దాతలను సన్మానించిన ధర్మారెడ్డి
ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ.. అన్నప్రసాదం విభాగం కోరిన మెనూ ప్రకారం కూరగాయలు సరఫరా చేసేందుకు దాతలు అంగీకరించినట్టు ఆయన తెలిపారు. ప్రస్తుతం రోజుకు 90 యూనిట్ల (యూనిట్‌కు 250 మంది) అన్న ప్రసాదం తయారు చేస్తున్నారు. దీనిని బట్టి ప్రస్తుత అవసరాలకు ఒక్కో యూనిట్‌కు 48 కిలోల కూరగాయలు అవసరమవుతాయని వివరించారు.
అలాగే గో ఆధారిత సేంద్రియ వ్యవసాయం ద్వారా కూరగాయలు పండించాలని దాతలను కోరారు. ఇక, దర్శన సమయంలో ప్రతి రోజూ 500 అరటిపండ్లను శ్రీవాణి ట్రస్టు భక్తులకు అందించేందుకు దాతలు ముందుకొచ్చారు.