Krishna District: కృష్ణా జిల్లా: ప్లాస్టిక్ బ్యాగుల తయారీ కంపెనీలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం!

huge fire accident in krishna dist Tempalli
షార్ట్స్‌లో చూడండి
కృష్ణా జిల్లాలోని ఓ ప్లాస్టిక్ సంచుల తయారీ పరిశ్రమలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. గన్నవరం మండలం తెంపల్లి రైల్వే గేట్ సమీపంలోని విజయ పారి మిల్స్ కంపెనీలో ఈ తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది అతి కష్టం మీద మంటలను అదుపు చేయగలిగారు. ఈ ఘటనలో భారీ ఆస్తినష్టం సంభవించి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Krishna District
Tempalli
Fire Accident
Sri Vidya polymers

More Telugu News