Bheemla Naik: ‘భీమ్లా నాయక్’లో టైటిల్ సాంగ్.. మార్మోగుతున్న ‘కిన్నెర’ మొగులయ్య పాట

Kinnera Mogulayya song in Bheemla Naik viral in Youtube
  • యూట్యూబ్‌లో 10 గంటల్లో 58 లక్షల వీక్షణలు
  • తండ్రి నుంచి వారసత్వంగా ‘కిన్నెర’ కళను అందిపుచ్చుకున్న మొగులయ్య
  • 8వ తరగతి పాఠ్య పుస్తకంలో మొగులయ్యపై పాఠం
  • తమిళనాడు అడవుల్లో ఆయనపైనే ‘భీమ్లానాయక్’ పాట చిత్రీకరణ
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా రూపొందుతున్న ‘భీమ్లా నాయక్’ సినిమాలో టైటిల్ సాంగ్ పాడిన నల్లమల కిన్నెర వాయిద్య కళాకారుడు దర్శనం మొగులయ్య పేరు ఇప్పుడు మార్మోగుతోంది. ఈ సినిమాలో ఆయన పాడిన టైటిల్ సాంగ్‌ను పవన్ బర్త్ డే సందర్భంగా నిన్న విడుదల చేయగా, యూట్యూబ్‌లో పది గంటల్లోనే 58 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మొగులయ్యకు సినిమాలో పాడే అవకాశం రావడంతో సంతోషం పట్టలేకపోతున్నాడు.

అంతరించిపోతున్న కిన్నెర వాయిద్య కళను కాపాడుతున్న మొగులయ్యను తెలంగాణ ప్రభుత్వం గుర్తించి ఉగాది పురస్కారంతో గౌరవించింది. 8వ తరగతిలో మొగులయ్యపై ప్రత్యేకంగా ఓ పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టింది. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం అవుసలికుంటకు చెందిన మొగులయ్య తండ్రి ఎల్లయ్య నుంచి ఈ కళను వారసత్వంగా పొందాడు. ఏడు మెట్ల కిన్నెరను పన్నెండు మెట్లుగా మార్చి ప్రదర్శనలు ఇచ్చేవాడు. మొగులయ్య ప్రతిభ తెలిసిన పవన్ కల్యాణ్ తన చిత్రం కోసం పాట పాడించారు. ఈ పాటను తమిళనాడు అడవుల్లో మొగులయ్యపైనే చిత్రీకరించడం విశేషం.
Bheemla Naik
Pawan Kalyan
Kinnera Mogulayya
Telangana
Nagarkurnool District

More Telugu News