Telangana: తెలంగాణ నీటి అవసరాలు తీరాలంటే విద్యుదుత్పత్తి అవసరమే!: రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్​ కుమార్​

It All Happened For Water Rajath Kumar On Telangana Movement
  • ఇవాళ కృష్ణా జలాల వాటాపై కేఆర్ఎంబీ మీటింగ్
  • అప్పట్లో ప్రభుత్వం 299 టీఎంసీలే ప్రతిపాదించిందన్న రజత్
  • ఇప్పటి అవసరాలతో పోలిస్తే చాలా తక్కువని కామెంట్
తెలంగాణ నీటి అవసరాలు తీరాలంటే విద్యుదుత్పత్తి అత్యంత ఆవశ్యకమని రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ అన్నారు. అసలు తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్ల కోసమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కృష్ణా జలాల వాటాపై ఇవాళ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం జరగనుంది. సమావేశానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో చాలా ఎత్తిపోతల ప్రాజెక్టులున్నాయన్నారు. హైదరాబాద్ కు కృష్ణా జలాలే ఆధారమని చెప్పారు. 299 టీఎంసీల నీళ్లు కావాలని గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిందని, కానీ, ఇప్పటి అవసరాలతో పోలిస్తే అది చాలా తక్కువని చెప్పారు. బేసిన్ అవతల కూడా ఏపీ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులను నిర్మిస్తోందని ఆయన ఆరోపించారు. కృష్ణాపై టెలీమెట్రీలు ఏర్పాటు చేయాల్సిందిగా ఎప్పట్నుంచో కోరుతున్నామన్నారు.
Telangana
Andhra Pradesh
Rajath Kumar
KRMB
Nagarjuna Sagar
Srisailam

More Telugu News